ముంబై కుర్రాడి వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు

ముంబై కుర్రాడి వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు

ముంబై: ముంబై యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ మోహితే.. మారథాన్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నాడు. నెట్స్‌‌‌‌‌‌‌‌లో 72 గంటల 5 నిమిషాల పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో ఎక్కువ సమయం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు సాధించాడు.  దీనిని గిన్నిస్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు గుర్తించాల్సి ఉంది. 2015లో విరాగ్‌‌‌‌‌‌‌‌ మానె 50 గంటల పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం ఇప్పటివరకు ఉన్న వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు. ఇప్పుడు 19 ఏళ్ల మోహితే దీనిని అధిగమించాడు. రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం తను గంటకోసారి ఐదు నిమిషాల బ్రేక్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. ‘నేను అనుకున్నది సాధించినందుకు సంతోషంగా ఉంది. నాలో ఏదో ప్రత్యేకత ఉందని తెలిపేందుకే ఈ మారథాన్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌ ఆడాను’ అని సిద్ధార్థ్​ చెప్పాడు.