13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

మునుగోడులో విజయం దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. బీజేపీ రెండు,మూడు రౌండ్లలో మాత్రమే లీడ్ లోకి వచ్చింది. ఇక మిగతా రౌండ్లు అన్నీ కారు పార్టీ ముందంజలో నిలిచింది. మర్రిగూడ మండలంలో కూడా కారు జోరు కొనసాగింది.

మునుగోడు బైపోల్ 13వ రౌండ్ లో అధికార టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. టీఆర్ఎస్ కు 6,618 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 5,346  ఓట్లు వచ్చాయి. 13  రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు 9,039 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక తదుపరిగా 14,15 రౌండ్లలో నాంపల్లి మండలం ఓట్లను లెక్కించనున్నారు.  అంతకుముందు 12వ రౌండ్ లో కూడా కారు పార్టీ ఆధిక్యంలో నిలిచింది.