మానవ రోబో  తయారీకి టెస్లా ప్లాన్

మానవ రోబో  తయారీకి టెస్లా ప్లాన్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ టెస్లా మానవ రోబోను తయారు చేయనుంది. దీనికి సంబంధించి ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ఈ విషయాన్నితెలిపారు. ‘టెస్లా బాట్’ పేరుతో దానిని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ టెస్లాబాట్ కు సంబంధించిన వివరాలను ఆయన చెప్పారు.

టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ ఆధారంగా రోబోకు రూపునిచ్చినట్టు చెప్పారు ఎలాన్ మస్క్. టాస్క్ లు చేయడం కోసం న్యూరల్ నెట్ వర్క్ కు సమాచారాన్ని పంపించేందుకు గానూ 8 కెమెరాలను అందులో పొందుపరిచారు. ఆ కెమెరాలు పంపించే సమాచారం ఆధారంగా ముందు వెనకా ఏమున్నాయో అంచనా వేస్తూ న్యూరల్ నెట్ వర్క్ పనులను చేస్తుంటుంది. మన మెదడు నిర్వహించే కార్యాలను చేస్తుంది.

పదే పదే చేయాల్సిన, ప్రమాదకర పనుల కోసం టెస్లాబాట్ ను వినియోగించుకోవచ్చని మస్క్ చెప్పారు. ప్రస్తుతానికి టెస్లాబాట్ ఎలా ఉంటుందో చూపించే నమూనాను మాత్రమే తెలిపారు. దాని ప్రొటోటైప్ ను వచ్చే ఏడాది నాటికి తయారు చేస్తామన్న మస్క్.. ఎప్పుడు విడుదల చేస్తారన్న కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు.

టెస్లాబాట్ ప్రత్యేకతలను తెలిపారు.ఎత్తు  5 అడుగుల 8 అంగుళాలు, బరువు సుమారు 57 కిలోలు ఉంటుందన్నారు. 20.5 కిలోల బరువులను మోస్కెళ్లగల సామర్థ్యం దీనిలో ఉందన్నారు.