నాంపల్లి అగ్ని ప్రమాదం.. బిల్డింగ్​ ఓనర్​ అరెస్టు

నాంపల్లి అగ్ని ప్రమాదం.. బిల్డింగ్​ ఓనర్​ అరెస్టు
  • నాంపల్లి అగ్ని ప్రమాదం.. బిల్డింగ్​ ఓనర్​ అరెస్టు
  • ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసిన పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు:  నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాద  ఘటనలో  భవన యజమాని రమేశ్​కుమార్ జైస్వాల్ ను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  ఇన్ స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. రమేశ్ కుమార్ జైస్వాల్ కు నాంపల్లి బజార్ ఘాట్ లో బాలాజీ అపార్ట్ మెంట్ పేరుతో జీ ప్లస్ 4 భవనం ఉంది. ఆయన అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో  గత కొన్నేళ్లుగా అక్రమంగా కెమికల్ డ్రమ్ములను నిల్వ చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారు.

 ఈ నెల 13వ తేదీన ఉదయం ప్రమాదవశాత్తు కెమికల్ డ్రమ్ములకు మంటలు  అంటుకుని భవనం మొత్తం కాలిపోయింది.   దీంతో రమేశ్​కుమార్ జైస్వాల్ పై పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ సంఘటనలో 9 మంది అక్కడిక్కడే, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. జైస్వాల్ కూడా అస్వస్థతకు గురై లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నాంపల్లి పోలీసులు ఆయనను  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.