హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ గ్రూప్ మరో నూతన విద్యాసంస్థ ‘ది వన్ స్కూల్’ ను హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభించింది. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వన్ స్కూల్ ను రూపొందించింది.
ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా పి. సింధూర నారాయణ మాట్లాడారు. విద్యార్థులు ఈ రోజుల్లో కేవలం ఎక్కువ మార్కులు సాధిస్తే చాలదని అభిప్రాయపడ్డారు. అంతకు మించి విమర్శనాత్మక ఆలోచన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక జీవన నైపుణ్యాలు అవసరమని తెలిపారు.
