ఇండియాలో బ్లాక్‌చెయిన్ విప్లవం: NBF ద్వారా ప‌రిపాల‌న బ‌లోపేతం.. నమ్మకానికి డిజిటల్ బాట

ఇండియాలో బ్లాక్‌చెయిన్ విప్లవం: NBF  ద్వారా ప‌రిపాల‌న బ‌లోపేతం.. నమ్మకానికి డిజిటల్ బాట

మొదట్లో క్రిప్టో కరెన్సీల (Crypto Currencies) ద్వారా బాగా పేరు పొందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, ఇప్పుడు 21వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన డిజిటల్ ఆవిష్కరణల్లో ఒకటిగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగా కంప్యూటర్ పై ఆధారపడకుండా, మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా పనిచేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచే శక్తి బ్లాక్‌చెయిన్‌కు ఉంది.

మన భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పాలనా వ్యవస్థలు సెంట్రలైజెడ్ డేటాబేస్‌లను వాడుతున్నాయి. వీటిలో తప్పులు, మోసాలు జరగడానికి అవకాశం ఎక్కువ. ఈ సమస్యలను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సహాయపడుతుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ (Distributed Ledger) అనే ఒక ప్రత్యేక సిస్టం. దీనిలో రికార్డులు మార్చడానికి వీలుండదు అంటే ట్యాంపర్-ప్రూఫ్ అన్నమాట.

ఈ సిస్టంలో రికార్డులు లేదా సమాచారం ఒకే చోట కాకుండా, చాల కంప్యూటర్లలో సురక్షితంగా స్టోర్  అవుతుంది. అందుకే, బ్లాక్‌చెయిన్‌లో రికార్డులను అనధికారికంగా మార్చడం అనేది అసాధ్యం. దీనివల్ల డేటా కచ్చితత్వం (Integrity), నమ్మకం చాలా పెరుగుతుంది.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వివిధ రంగాలలో బ్లాక్‌చెయిన్ సిస్టంను ఏర్పాటు చేయడానికి ఒక విధానాన్ని నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ (NBF) ను అభివృద్ధి చేసింది.

బ్లాక్‌చెయిన్ అంటే ఏంటి ?
బ్లాక్‌చెయిన్ అనేది  పారదర్శకంగా ఉండే, సురక్షితమైన, మార్చడానికి వీలులేని (Tamper-proof) ఒక డేటాబేస్. ఇది రికార్డులు లేదా లావాదేవీలను స్టోర్  చేస్తుంది, అలాగే వాటిని అక్రమంగా మార్చకుండా ఆపుతుంది.  

బ్లాక్‌చెయిన్ రకాలు:
పబ్లిక్ బ్లాక్‌చెయిన్ (Public Blockchain): ఈ నెట్‌వర్క్‌లో ఎవరైనా రికార్డులను, లావాదేవీలను చూడవచ్చు. ఇది అందరికీ తెరిచి ఉంటుంది.

ప్రైవేట్ బ్లాక్‌చెయిన్ (Private Blockchain): ఇది అనుమతి ద్వారా పనిచేస్తుంది. ఏదైనా సంస్థలోని కొందరికి లేదా అధికారం ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 

కన్సార్టియం బ్లాక్‌చెయిన్ (Consortium Blockchain):
ఈ నెట్‌వర్క్ కొద్దిగా వికేంద్రీకృతమై ఉంటుంది. డేటా నిర్వహణ, ధృవీకరణ కోసం కలిసి పనిచేసేలా వివిధ సంస్థలు దీనిని  కలిసి   నిర్వహిస్తాయి.

హైబ్రిడ్ బ్లాక్‌చెయిన్ (Hybrid Blockchain):
ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్లాక్‌చెయిన్‌ల కలయిక. ఇందులో కొన్ని రికార్డులు అందరికీ (పబ్లిక్) అందుబాటులో ఉంటాయి, మరికొన్ని కొందరికి (ప్రైవేట్) మాత్రమే అనుమతి ఉంటుంది. నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ (NBF)ను 2021 మార్చిలో రూ.64.76 కోట్ల ఖర్చుతో ప్రారంభించగా... 4 సెప్టెంబర్  2024న అధికారికంగా మొదలైంది. NBFలో విశ్వస్య బ్లాక్‌చెయిన్ స్టాక్ చాలా ముఖ్యమైన భాగం:

ఈ వ్యవస్థను హైదరాబాద్, పుణె, భువనేశ్వర్‌లలోని NIC డేటా సెంటర్‌లలో ఏర్పాటు చేశారు. దీనివల్ల బ్లాక్‌చెయిన్ అప్లికేషన్‌లు పటిష్టంగా, లోపాలను తట్టుకునేలా, వినియోగాన్ని పెంచగలిగేలా ఉంటాయి.

డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ డిజిటల్ పాలనలో (Digital Governance) నమ్మకాన్ని, పారదర్శకతను తీసుకొస్తుంది. మన టెక్నాలజీలో  ఆత్మ నిర్భర్ భారత్, ఆవిష్కరణ దారి చూపించేలా, ప్రభుత్వం నుండి పౌరులకు (G2C) అలాగే  ప్రభుత్వం నుండి వ్యాపారాలకు (G2B) సేవలు అందించడానికి మద్దతుగా, నేషనల్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ (NBF) ద్వారా భారతదేశం అందరినీ కలుపుకొనిపోయే బ్లాక్‌చెయిన్ వ్యవస్థను నిర్మిస్తోంది.

 మన దేశంలో తయారైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతూ అందరి అభివృద్ధి కోసం బ్లాక్‌చెయిన్ వాడకంలో భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో అగ్రగామిగా నిలవడానికి సిద్ధంగా ఉంది.