ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ బుక్ ఫెయిర్ శుక్రవారం షురూ అయ్యింది. ఈసారి లోకకవి అందెశ్రీ పేరుతో పెట్టిన పుస్తకాల పండుగలో బుక్ స్టాళ్లతోపాటు తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులు, యువతకు డ్రగ్స్, మొబైల్ వాడకం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహనకు ప్రత్యేకంగా సెల్ఫీ స్పాట్ ఏర్పాటు చేశారు. 11 రోజులపాటు జరిగే బుక్ఫెయిర్లో తొలిరోజు రద్దీ తక్కువగా కన్పించింది. – వెలుగు, ముషీరాబాద్
