ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

కాశీబుగ్గ/ రేగొండ, వెలుగు: జాతీయ రైతు దినోత్సవం వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్​ఛాంబర్​ప్రతినిధులు బొమ్మినేని రవీందర్​ రెడ్డి, చింతలపల్లి వీర రావు, రాజేశ్​ కరాని తదితరులున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక రైతు వేదికలో నిర్వహించిన వేడుకల్లో ఎస్బీఐ వరంగల్​ రూరల్​ ఏజీఎం ఏఎన్​వీ సుబ్బారావు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. 

అనంతరం పలువురు రైతులను సన్మానించారు. పరకాల ఎస్బీఐ ఏసీబీ చీఫ్ మేనేజర్ రవి, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ నిఖిల్, సీఎస్పీ పాయింట్ నిర్వాహకులు మడప మమత సంపత్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, సర్పంచ్ గుల్ల స్వప్న తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.