నిరుద్యోగులకు గుడ్ న్యూస్: NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్..

నేషనల్ హైవేస్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్​హెచ్ఐడీసీఎల్) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్/ బీఈ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్ట్ పేరు: డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్ క్యాడర్), ఈ2 గ్రేడ్.

మొత్తం ఖాళీలు: 85. (అన్​రిజర్వ్డ్ 36, ఎస్సీ 13, ఎస్టీ 06, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ 08, పీహెచ్02) 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2024 / 2025 / 2026 సంవత్సరాల్లో ఏదైనా ఒక ఏడాదిలో వ్యాలిడ్ గేట్ స్కోర్‌ కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 34ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్  వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 09.

లాస్ట్ డేట్: జూన్ 8.

సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఉండదు. కేవలం గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ nhidcl.comను సందర్శించండి.