
హైదరాబాద్, వెలుగు: ధరణి పెండింగ్ సమస్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 29న సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు కొన్ని జిల్లాలు, మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు మిగతా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సర్య్కులర్ జారీ చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లను సంబంధిత వివరాలతో అందుబాటులో ఉండాలని సీసీఎల్ఏ ఆదేశించారు.