నీళ్ల సమస్య ఉందని.. వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వలేం.. బెంగళూరు ఐటీ కంపెనీలు

నీళ్ల సమస్య ఉందని.. వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వలేం.. బెంగళూరు ఐటీ కంపెనీలు

టెక్ హబ్ గా పేరు పొందిన బెంగళూరు నగరం ఇప్పుడు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. నీటి నిపుణులు, న్యాయ వ్యక్తులు సంక్షోభాన్ని పరిష్కరించడానికి తాత్కాలికంగా ఇంటి నుండి పని చేయండని సూచిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం దాదాపు రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరతను గుర్తించడంతో నగరం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందని అంచనా వేస్తున్నారు. 

నగర ప్రస్తుత అవసరాలను తీర్చడానికి కనీసం 2,600 మిలియన్ లీటర్ల నీరు అవసరం. కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీధర్ రావు వర్క్ ఫ్రమ్ హోం ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. బెంగళూరులోని పదిహేను లక్షల మంది ఐటీ ఉద్యోగులు రిమోట్ గా పని చేయడానికి అనుమతించాలని కంపెనీలకు సూచించారు.

ఇది దాదాపు 1 మిలియన్ల మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి దారితీస్తుందని, నగరంలోని నీటి వనరులపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సరస్సులను పూడిక తీయడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరు ఇలా చెబితే ఐటీ కంపెనీలు మాత్రం నీటి కొరత ఉందని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వలేమని అంటున్నాయి.

 నీటి సమస్యల ఓ కంపెని యజమాని  స్పందిస్తూ కార్యాలయంలో, తాము ఎప్పటిలాగే నీటి వృధాను నిరోధించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కానీ పని పరిస్థితి హైబ్రిడ్ మరియు ఉద్యోగులు అవసరాల ఆధారంగా కార్యాలయానికి వస్తారని చెప్పారు. నీటి కొరత అనేది తాత్కాలిక సమస్య అని అన్నారు. తాము  అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ డెలివరీ చేయాలంటే ఆఫీస్ నుంచి పని చేస్తేనే బాగుంటుందని అన్నారు.