విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు : విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. మంగళవారం నిజామాబాద్ దుబ్బ ఏరియా మున్నూరు కాపు ఫంక్షన్ హాల్​లో పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లడానికి టెన్త్ క్లాస్​మొదటి మెట్టులాంటిదన్నారు. సర్కార్ హాస్టళ్లలో వసతులు పెరిగాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కార్పొరేట్​కు దీటుగా సర్కారు బడుల్లో విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకుతెచ్చుకుని కష్టపడి చదవాలన్నారు. టెన్త్​లో 10 గ్రేడ్​ పాయింట్స్​తో పాసయ్యే స్టూడెంట్స్​కు బిగ్​ స్క్రీన్​పై టి-20 క్రికెట్ వరల్డ్ కప్ లైవ్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ కరోలిన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్​ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.