180 దేశాల్లో ఎయిర్​టెల్​ రోమింగ్

180 దేశాల్లో ఎయిర్​టెల్​ రోమింగ్

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ ఎయిర్‌‌టెల్ మంగళవారం తన ప్రీపెయిడ్,  పోస్ట్‌‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌‌లను ప్రకటించింది. ఎయిర్‌‌టెల్ వరల్డ్ పాస్ ప్లాన్‌‌లుగా పిలిచే అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌‌లతో 180కి పైగా దేశాల్లో మొబైల్​ నెట్​వర్క్​ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌‌లలో డేటా,  వాయిస్ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఎయిర్‌‌టెల్ తెలిపింది. వరల్డ్​పాస్​180కి పైగా దేశాలలో చెల్లుతుంది కాబట్టి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో కూడా టెలికాం సేవలను పొందేందుకు అదనపు ప్యాక్ అవసరం లేదు.  

వాట్సాప్​ చాట్‌‌బాట్ ద్వారా ఎల్లప్పుడూ కస్టమర్​ కేర్​ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.  వాడకం, బిల్లింగ్, డేటా వివరాలను ఎయిర్​టెల్​ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. పోస్ట్‌‌పెయిడ్ కస్టమర్‌‌ల కోసం  రూ. 649 నుంచి రూ.15 వేల వరకు మొత్తం ఐదు ప్లాన్‌‌లు ఉన్నాయి.   ప్రీపెయిడ్‌‌లో ఎయిర్‌‌టెల్ వరల్డ్ పాస్ కింద మొత్తం నాలుగు ప్లాన్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 649 నుంచి రూ.రూ. 2,998 వరకు ఉంటుంది.