57 ఏండ్లు వస్తే వృద్ధాప్య పెన్షన్: కేసీఆర్

V6 Velugu Posted on Aug 01, 2021

  • దీభీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంట్

హైదరాబాద్: వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో  రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది.  కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్  బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అలాగే దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
 

Tagged Telangana today, , ts today, telangana latest updates, telangana cabinet latest decessions, old age pension age reduced, free power upto 250 units, Saloons in ts, dobhi Ghats in ts

Latest Videos

Subscribe Now

More News