లక్షణాలు స్వల్పం కానీ.. డెల్టా కన్నా డేంజర్

లక్షణాలు స్వల్పం కానీ.. డెల్టా కన్నా డేంజర్

ఢిల్లీ : కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది. తాజాగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు కాస్త స్వల్పంగానే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే కొత్త వేరియెంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటం పరిస్థితి తీవ్రతను పెంచుతోంది. 
ఒమ్రికాన్ సోకిన పేషెంట్లలో డెల్టా వేరియెంట్ సోకిన వారి కన్నా స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. పాత వేరియెంట్ల సోకిన రోగుల్లో దగ్గు, ముక్కు కారడం, హై ఫీవర్, గొంతునొప్పి తదితర లక్షణాలు కనిపించేవి. కొత్త వేరియెంట్ సోకిన బాధితుల్లో తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట, లో ఫీవర్ తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ టీకా తీసుకోని వారిలో మాత్రమే తీవ్రమైన తల, ఒంటి నొప్పులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వారికి సైతం ఒమిక్రాన్ సోకుతున్నప్పటికీ వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, సాధారణ మందులతో అవి తగ్గిపోతున్నాయని అంటున్నారు.

For more news : 

గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ పై పనిచేస్తున్న ఫైజర్ గోలి

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ

రూల్స్ పాటించకుంటే జీతం కట్