ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యలపై జులై 28న ఓపెన్ కోర్టు హియరింగ్

ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యలపై జులై 28న  ఓపెన్ కోర్టు హియరింగ్

ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఇప్పటివరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దిడ్డి సుధాకర్ డిమాండ్​చేశారు. దీనిపై నేషనల్ హ్యూమన్  రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. 

ఆదివారం లిబర్టీలోని పార్టీ ఆఫీస్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్​పాయిజన్​, విద్యార్థుల మృతిపై సోమవారం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్​స్టిట్యూట్​లో ఓపెన్ కోర్టు హియరింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసంఘాలు, మానవ హక్కుల, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు హాజరై, ఎన్​హెచ్ఆర్సీ బృందానికి అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. నాయకులు బుర్ర రాముగౌడ్, జావిద్, నవీన్ పాషా, శ్రీనివాస్, రాజేందర్, శివాజీ తదితరులున్నారు.