ఓయూను గ్లోబల్ యూనివర్సిటీగా మార్చేందుకు కసరత్తు

ఓయూను గ్లోబల్ యూనివర్సిటీగా మార్చేందుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించి, గ్లోబల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతోంది. అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లతో చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధిపై శనివారం సెక్రటేరియెట్​లో  ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. 

ప్రభుత్వ సలహాదారు కేశవరావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ భేటీకి విద్యా శాఖ సీనియర్  అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఐఎస్‌‌‌‌‌‌‌‌బీ, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కమిటీ బృందం ఇటీవల సందర్శించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించింది.