అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మంగళవారం రోజు ఘోర ప్రమాదం జరిగింది. విపరీతంగా మంచు కురవడంతో ఇంటర్‌స్టేట్ 196 హైవేపై 100 పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం గ్రాండ్ రాపిడ్స్ సమీపంలోని హడ్సన్‌విల్లే దగ్గర జరిగింది.
ఢీకొన్న వాహనాల్లో 30కి పైగా పెద్ద లారీలు, సెమీ ట్రక్కులు ఉన్నాయి. మంచు వల్ల రోడ్లు జారుడుగా మారడంతో వాహనాలు అదుపుతప్పి ఒకదానిపైకి ఒకటి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో చాలా మందికి గాయాలు కాగా.. ఎవరూ చనిపోలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హైవేను రెండు వైపులా మూసివేశారు. రోడ్డు మీద చిక్కుకుపోయిన ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించి దగ్గర్లోని హడ్సన్‌విల్లే హైస్కూల్‌కు తరలించారు.
కేవలం మిచిగాన్ మాత్రమే కాదు, అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. మిన్నెసోటా, విస్కాన్సిన్, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
ఎప్పుడూ వేడిగా ఉండే ఫ్లోరిడాలో కూడా మంచు కురిసింది. దింతో చికాగోలో జరుగుతున్న ఫుట్‌బాల్ గేమ్ కష్టంగా మారింది. ఫ్లోరిడా, జార్జియా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి పడిపోతాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
