వీరికి న్యూ ఇయర్ కాస్త బ్యాడ్ ఇయర్ అయ్యింది..ఎందుకో తెలుసా..!

వీరికి న్యూ ఇయర్ కాస్త బ్యాడ్ ఇయర్ అయ్యింది..ఎందుకో తెలుసా..!

కొత్త సంవత్సరాన్ని ఎంతో ఆహ్లాదకరంగా వెల్ కమ్ చెబుతామని అందరు ప్రయత్నిస్తారు. అలా నగరమంతా ఓ రైడ్ వేసొద్దామని ప్లాన్ చేస్తుంటారు.  తమ నివాసాల నుంచి బయటకు వచ్చి సిటీ మొత్తం చక్కర్లు కొడుతుంటారు. ఈ క్రమంలోనే 2024 సంవత్సరాన్ని వెల్ కమ్ చెబుతామని ఎంతో మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతు సిటీలో తిరిగారు. దీంతో  రాష్ట్ర రాజదాని హైదరాబాద్  నగర వ్యాప్తంగా భారీగా డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

 హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 2 వేల 700 డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 వందల కేసులు నమోదు కాగా సైబరాబాద్ పరిధిలో 12 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి.స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి రాత్రి 8 గంటల నుంచి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. 

సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 12 వందల 41 మందిపై మద్యం తాగి వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు. ఇందులో 938 బైకులు, 275 కార్లు ఉన్నాయని తెలిపారు. పట్టుబడిన వారిలో 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు  382 మంది,  26- నుంచి36 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 536 మంది,  35 నుంచి -45 సంవత్సరాల వయస్సు గలవారు 239 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.  

సైబరాబాద్‌లోని 15 పోలీస్ స్టేషన్‌లలో అత్యదికంగా మియాపూర్‌ పీఎస్ పరిధిలో 263 కేసులు నమోదయ్యాయని అన్నారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 123 కేసులు నమోదయ్యాయని తెలిపారు. డ్రంక్ ఆండ్ డ్రైవ్ పై పులువురు స్పందిస్తూ వీరికి న్యూ ఇయర్ కాస్త బ్యాడ్ ఇయర్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు.