IPL 2026 Mini-auction: ఓవర్సీస్ స్లాట్స్‌పై అందరి దృష్టి.. వేలంలో ఏ జట్టు ఎంతమంది విదేశీ ఆటగాళ్లను కొంటారంటే..?

IPL 2026 Mini-auction: ఓవర్సీస్ స్లాట్స్‌పై అందరి దృష్టి.. వేలంలో ఏ జట్టు ఎంతమంది విదేశీ ఆటగాళ్లను కొంటారంటే..?

ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లపై ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్లేయింగ్ 11లో నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కుతుంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కూడా విదేశీ ఆటగాళ్లపై భారీ హైప్ నెలకొంది.  డేవిడ్ మిల్లర్, మహేష్ తీక్షణ, హసరంగా, కామోరూన్ గ్రీన్, లివింగ్ స్టోన్ లాంటి ఆటగాళ్లు ఈ మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. స్టీవ్ స్మిత్, డికాక్ లాంటి సీనియర్ ప్లేయర్స్ పై ఆసక్తి నెలకొంది. మరో 24 గంటల్లో ఫ్రాంచైజీలు, ప్లేయర్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఆక్షన్ ప్రారంభం కానుంది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మెగా ఆక్షన్ ను నిర్వహించనున్నారు. 

మినీ వేలం కావడంతో ఒక్క రోజు మాత్రమే వేలం ఉంటుంది. 350 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం (డిసెంబర్ 9) బీసీసీఐ ప్రకటించింది. 350 మంది ఆటగాళ్లలో 240 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. మిగిలిన 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉంటే.. 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. 238 మందిలో 224 మంది ఇండియన్స్ కాగా.. కేవలం 14 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 

ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి. స్క్వాడ్ లో 25 మంది ప్లేయర్స్ ఉండాలి. వీరిలో 17 మంది భారత క్రికెటర్లు.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండాలి. ఏ జట్టు దగ్గర ఎంతమంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..  

కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 64.3 కోట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ దగ్గర ఇద్దరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు సునీల్ నరైన్, రోవ్ మెన్ పావెల్ కేకేఆర్ జట్టులో ఉన్నారు. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో 6 మంది విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.     
 
చెన్నై సూపర్ కింగ్స్ - 43.4 కోట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. డెవాల్డ్ బ్రేవీస్, నాథన్ ఎల్లిస్, జెమీ ఓవర్ టన్, నూర్ అహ్మద్ ను CSK రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో 4 గురు విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.                

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 25.5 కోట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, పాట్ కమిన్స్, ఎషాన్ మలింగ, హెన్రిచ్ క్లాసన్ లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో 4 గురు విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.
 
లక్నో సూపర్ జెయింట్స్ - 22.95 కోట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రామ్, మాథ్యూ బ్రీట్జ్కే, మిచెల్ మార్ష్ లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.             

ఢిల్లీ క్యాపిటల్స్ - 21.8  కోట్లు 

ఢిల్లీ క్యాపిటల్స్ ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.    

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 16.4 కోట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, నువాన్ తుషార లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కొనాల్సి ఉంది.   

రాజస్థాన్ రాయల్స్ - 16.05 కోట్లు: 

రాజస్థాన్ రాయల్స్ షిమ్రోన్ హెట్మెయర్, లుహాన్ డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, సామ్ కుర్రాన్, క్వేన్ మఫాకా, బర్గర్ లు రాజస్థాన్ జట్టులో ఉన్నారు.  వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఒకరిని మాత్రమే కొనాల్సి ఉంది. 

గుజరాత్ టైటాన్స్ - 12.9 కోట్లు: 

గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్, కగిసో రబడ, రషీద్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్ లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో నలుగురిని కొనాల్సి ఉంది. 
 
పంజాబ్ కింగ్స్ - 11.5 కోట్లు 

మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఓవెన్, లాకీ ఫెర్గూసన్, బార్ట్ లెట్, మార్కో జాన్సెన్ లను రిటైన్ చేసుకుంది. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇద్దరిని కొనాల్సి ఉంది. 

ముంబై ఇండియన్స్ - 2.75 కోట్లు
 
కార్బిన్ బాష్,  మిచెల్ సాంట్నర్, ర్యాన్ రికెల్ టన్, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్, రూథర్ ఫోర్డ్, ఏఎమ్ గజన్‌ఫర్ లు ముంబై జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు. వారు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఒకరిని మాత్రమే కొనాల్సి ఉంది.