
వెలుగు, ముషీరాబాద్: సిటీలోని రాంనగర్‌కు చెందిన కవిత, జగదీశ్ దంపతులు తమకున్న జంతు ప్రేమను చాటుకున్నారు. మూడేండ్లుగా కన్న కూతురితో సమానంగా చూసుకుంటున్న పెంపుడు కుక్క ‘మిల్కీ’కి శనివారం సీమంతం నిర్వహించారు. పట్టుచీర, బంగారు నగలతో మిల్కీని అలంకరించి, 9 రకాల స్వీట్లు, 5 రకాల పండ్లు, 5 రకాల వంటకాలతో వేడుక చేశారు. 50 మంది స్థానికులు, బంధువులను పిలిచి భోజనాలు పెట్టారు.