నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ ను మించిన నష్టం

నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ ను మించిన నష్టం

న్యూఢిల్లీ: కరోనా వేరియంట్ భవిష్యత్ లో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. ఒమిక్రాన్ పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు నిబంధనలు పాటించడం తప్ప మరో మార్గం లేదని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ ను మించిన నష్టాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించింది.

55 దేశాలకు పాకిన ఒమిక్రాన్ వేరియంట్

ఒమిక్రాన్ కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర వైరస్ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో మరింత అప్రమత్తమయ్యాయి దేశాలు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,347 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. మొత్తంగా 55 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. యూకేలో 336 కేసులు, డెన్మార్క్ లో 261 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. సౌతాఫ్రికాలో ప్రస్తుతం 228 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇక, భారత్ లో సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది.