
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణంలోనైనా భారత్ దాడి చేయొచ్చని పాక్ వణికిపోతుంది. ఈ క్రమంలో ఇండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్న పాక్ లీడర్లు. మాస్టర్ ప్లాన్ తోనే తమపై విరుచుపడవచ్చని పాక్ లో టెన్షన్ మొదలైంది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఇండియా బార్డర్ లోని గ్రామాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఫుడ్, రేషన్ ఇతర ఆహార పదార్థాలను భద్ర పరుచుకోవాలని సూచించింది.
భారత్ దాడి చేస్తే ముందుగా ఆక్రమిత కాశ్మీర్ పైనే దాడి చేస్తుందని పాక్ భయపడుతోంది. ఇప్పటికే POK బార్డర్ లో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు మోహరించి ఉన్నాయి. సరిహద్దు వెంట భారత్ యుద్ధ విన్యాసాలు, మరోవైపు అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌకల మోహరింపు చూసి పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుడుతోంది. పరిస్థితులు ముదిరాయి..యుద్ధ గడియలు సమీపించాయని గ్రహించిన పాక్.. సరిహద్దు గ్రామాల ప్రజల్ని షిఫ్ట్ చేస్తోంది.