- పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి
పర్వతగిరి (గీసుగొండ, సంగెం), వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం గీసుగొండ మండలం వంచనగిరి, సంగెం మండలం గుంటూర్పల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, గవిచర్ల, రాంచంద్రాపురం, లోహిత, షాపూర్, తీగరాజుపల్లి, సోమ్లాతండా, కొత్తగూడెం, తిమ్మాపురం, నర్సానగర్, ఎల్గూర్స్టేషన్, బిక్కోజినాయక్తండా, ఎల్గూర్ రంగంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

