ట్రైబల్ వర్సిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ట్రైబల్ వర్సిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీల(సవరణ) -2023 బిల్లును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల సభ్యులు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. లోక్ సభ ఘటనతో భద్రతా లోపాలపై హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తు విపక్షాలు వాకౌట్ చేశాయి.

దీంతో సెంట్రల్ యూనివర్సిటీల(సవరణ) బిల్లు-2023 ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ... ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తప్పనిసరి అన్నారు. కాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల(సవరణ) బిల్లుకు గతవారం లోక్‌‌సభ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ లో సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పార్లమెంట్ ఆమోదం పొందినట్లైంది.