జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను దోచేస్తున్నారని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2024లో ప్రభుత్వం మారాక అన్నింటినీ బయటకు తీసుకొస్తామని, నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి, గుర్తుపెట్టుకో అంటూ ముఖ్యమంత్రి జగన్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న సీబీసీఎన్ సీ భూములను, అందులో జరుగుతున్న భనవ నిర్మాణాలను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలకు పాల్పడుతోందని పవన్ ఆరోపించారు. ఓయూ విద్యార్థులు తెలంగాణ కోసం నిలబడినట్లు ఏయూ విద్యార్థులు కూడా ఉత్తరాంధ్ర కోసం నిలబడాలి. విశాఖ నుంచి వెళ్లిపోతానని ఎంపీ ఎంవీవీ అంటున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయండి. మళ్లీ ఎన్నికలు వస్తాయి. మీ ప్రైవేట్ వ్యాపారాల కోసమా ఎంపీగా గెలిపించింది? కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్ కబ్జాలను, అక్రమాలను బయటకు తెస్తాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు