పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయ్

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయ్

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 18 పైసలు పెంచారు. డీజిల్ ధర పెరగలేదు. పెరిగిన రేట్లతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 78 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 40 పైసలుగా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 99 రూపాయల 86 పైసలకు చేరింది. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 105 రూపాయల 92 పైసలకు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల 75 పైసలకు పెరిగింది. రాజస్థాన్ జయపురలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 62 పైసలకు చేరింది.

మేలో ఫస్ట్ టైం భోపాల్ లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. ఇప్పటివరకు దాదాపు 12 రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు వంద దాటాయి. రెండు నెలల్లోనే పెట్రోల్ రేట్లు 34 సార్లు పెరిగాయి. అంటే రోజుతప్పి రోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండునెలల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పదిశాతం పెరిగాయి. పెట్రో మంటపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. కరోనా కష్టాల నుంచి కోలుకోకముందే రేట్లు పెంచుతూ తమ నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.