ఫోటోలు దిగితే టమాటలు ఫ్రీ.. ఎక్కడంటే.?

ఫోటోలు దిగితే  టమాటలు ఫ్రీ.. ఎక్కడంటే.?

మార్కెట్లో టమాటా ధర భగ్గుమంటోంది. డబుల్ సెంచరీ దాటి పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో టమాటా కొనుగోలు చేయాలంటేనే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాస్ పోర్ట్ సైజ్   ఫోటోలు దిగండి టమాటాలు పట్టుకెళ్ళండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఓ ఫొటోగ్రాఫర్.

టమాట రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో  భద్రాద్రి కొత్తగూడెంలో  ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఓ ఫోటో గ్రాఫర్ ఈ ఆఫర్ ను ప్రకటించారు.  తన స్టూడియోకు వచ్చి పాస్ ఫోటోలు దిగే వారికి టమాటాలు ఫ్రీగా ఇస్తున్నాడు.  వంద రూపాయలతో 8 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వడమే కాకుండా 50రూపాయల విలువ గల టమాటాల ప్యాకెట్ ను కానుకగా అందిస్తున్నాడు.

ఇటీవల కాలంలో వ్యాపారం సాగకపోవడంతో  ఏం చేయాలని తన మిత్రులతో చర్చించి  మార్కెట్ లో ఎక్కువ రేటున్న  టమాటాలను ఆఫర్ గా పెట్టినట్లు తెలిపారు.  కస్టమర్లను ఆకర్షించేందుకు పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశానని ఫోటో స్టూడియో ఓనర్ ఆనంద్ తెలిపాడు. టమాట ధరలు తగ్గేవరకు ఈ ఆఫర్ ను కొనసాగిస్తానని చెప్పాడు.