మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు

మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు

పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు జైలు శిక్ష తో పాటు జరిమానా విధించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. అభియోగం రుజువు కావడంతో  కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.  
కోర్టు ఆదేశాలతో రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది.