రైతులకు గుడ్​ న్యూస్​: రైతుల ఖాతాల్లోకి మళ్లీ డబ్బులు ఎప్పుడంటే...

రైతులకు గుడ్​ న్యూస్​:  రైతుల ఖాతాల్లోకి మళ్లీ డబ్బులు ఎప్పుడంటే...

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది.  ఇప్పటికే  16 విడతలుగా రైతులకు పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధిని  విడుదల చేసిన కేంద్రం... ఇప్పుడు 17 వ విడతను ఎప్పుడు విడుదల చేస్తారో కీలక అప్​ డేట్​ ఇచ్చింది.  17వ నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన స్కీమ్. చిన్నపాటి భూమి కలిగి ఉన్న సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీంను తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలు అందిస్తోంది. అయితే దీనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తోంది. డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోనే వేస్తుంది. ఇప్పటివరకు కేంద్రం.. 16 విడతల్లో మొత్తం ఒక్కొక్కరికి రూ. 32,000 అందించింది.

  • >> ఇప్పుడు 17వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. చివరిసారిగా 16వ విడత నిధుల్ని ప్రధాని మోదీ.. ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యావత్మాల్ వేదికగా విడుదల చేశారు. అప్పుడు 9 కోట్ల మందికిపైగా రైతులు ఈ స్కీం ద్వారా ప్రయోజనం పొందారు.
  • >> అయితే 17వ నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.
  • >> అయితే ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రం 17వ విడత డబ్బులు పడతాయని తెలుస్తోంది. కేంద్రం.. ఎప్పుడూ ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. PM Kisan GOI App ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్‌తోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.

eKYC ఎలా అప్​ డేట్​ చేయాలంటే 

  • >>PM కిసాన్ eKYCని OTPతో ఆన్‌లైన్‌లో చాలా సులభంగా అప్​ డేట్​ చేసుకోవచ్చు 
  • >>PM కిసాన్ ఫండ్‌ను రైతుల ఖాతాల్లో జమ కావాలంటే  eKYC తప్పనిసరి. OTP-ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది.   లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించాలి. 
  • >> PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి 
  • >>మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • >>ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, "సెర్చ్" బటన్‌పై క్లిక్ చేయండి.
  • >>ఆధార్ కు లింక్​ అయిన మొబైల్​ నంబర్​ ను నమోదు చేయాలి.
  • >>గెట్ మొబైల్ OTP పై క్లిక్ చేయండి. మీ నమోదిత మొబైల్ నంబర్‌కు  OTP వస్తుంది.  
  •  >>OTPని  ఎంటర్​ చేసి సబ్​ మిట్​పై క్లిక్ చేస్తే PM కిసాన్ KYC అప్‌డేట్ పూర్తవుతుంది. 

PM కిసాన్ KYC  స్టేటస్​ ను ఎలా తెలుసుకోవాలంటే...

  •  >>PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌కి వెళ్లండి 
  •  >>PM కిసాన్ KYC స్టేటస్​ పేజీపై  క్లిక్ చేయండి
  •  >>మీ ఆధార్ నంబర్‌ను  ఎంటర్​ చేసి .. క్యాప్చా కోడ్​ ను  ఎంటర్​ చేయండి.
  •  >>సెర్చ్​ బటన్​ పై క్లిక్​ చేయండి..  అప్పుడు  KYC కంప్లీట్​ అయిందా లేదా తెలుస్తుంది.  ఒకవేళ కాకపోతే.. ఎందుకు అప్​ డేట్​ కాలేదో  వివరాలు వస్తాయి. 

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలంటే 

  •  >>అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి 
  •  >> పేజీకి కుడి వైపున 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  •  >>మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్​ చేసిన తరువాత .. మీకు సంబంధించిన వివరాలను సెలక్ట్​ చేసుకోండి

లబ్ధిదారుల జాబితాలో మీ పేరును ఎలా తనిఖీ చేయాలి

  •  >>PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in 
  •  >>హోమ్‌పేజీలో "PM కిసాన్ లబ్ధిదారుల జాబితా" మెనుపై క్లిక్ చేయండి.
  •  >> మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, తహసీల్, గ్రామం , బ్లాక్‌ని ఎంచుకోండి.
  •  >>'గెట్ రిపోర్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  •  >>PM కిసాన్ 17వ లబ్ధిదారుల జాబితా 2024 మీ స్క్రీన్‌పై వస్తుంది.