ప్రధాని మోదీ జపాన్ పర్యటన: గాయత్రీ మంత్రంతో ఘనస్వాగతం పలికిన టోక్యో కళాకారులు..

 ప్రధాని మోదీ జపాన్ పర్యటన:  గాయత్రీ మంత్రంతో ఘనస్వాగతం పలికిన టోక్యో కళాకారులు..

భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకం గురించి ప్రతిచోటా చర్చలు జరుగుతున్నాయి. భారత వాణిజ్యంపై సుంకాలు విధించాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం ప్రభావాన్ని తగ్గించడానికి మోడీ ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో ఇతర దేశాలతో  కీలక ఒప్పందాలు  కుదుర్చుకోవచ్చని చెబుతున్నారు. 

అయితే భారత  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం జపాన్  చేరుకున్నారు. ఇక్కడ జరగనున్న 15వ ఇండియా-జపాన్ అన్యువల్ సమ్మిట్లో మోడీ పాల్గొంటారు. అయితే జపాన్‌లోని టోక్యోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.

ఆయన జపాన్ చేరుకున్న వెంటనే స్థానిక కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు. 

పెట్టుబడుల పై చర్చ: జపాన్‌లోని భారతీయ ప్రజల సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడానికి అలాగే జపాన్ దేశానికే  సహాయ సహకారాలను అందించడానికి నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

అయితే మరికొన్ని గంటల్లో వ్యాపారుల బృందంతో మోడీ చర్చించనుండగా, భారతదేశం-జపాన్ వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెడతానని మోడీ అన్నారు. అలాగే ఈ పర్యటన  రెండు దేశాల భాగస్వామ్యాన్నీ మరింతగా పెంచుకోవడానికి  కొత్త మార్గాలను అన్వేషించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

మోడీ రెండు రోజుల జపాన్ పర్యటన: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలో  15వ ఇండియా-జపాన్ అన్యువల్ సమ్మిట్లో పాల్గొంటారు. జపాన్ చేరుకున్న ప్రధానికి భారతదేశంలోని జపాన్ రాయబారి ఒనో కీచి, జపాన్‌లో భారత రాయబారి సిబి జార్జ్ ఇంకా ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

జపాన్ ప్రధానిని కావనున్న మోడీ : ఆగస్టు 29-30 తేదీల్లో జరిగే మోడీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో  తొలి అధికారిక చర్చలు జరుపనున్నారు. ఈ ఇద్దరు నాయకులు భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంతో ఉంటారని భావిస్తున్నారు. ఇందులో రక్షణ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు మొదలైనవి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా జపాన్‌కు చేస్తున్న 8వ పర్యటన ఇది.