వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు

వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులకు  కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది . ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై విపక్షాలు పదేపదే విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

అన్ని మంత్రిత్వ శాఖలు, పలు విభాగాల్లోని మానవ వనరుల  స్థితిగతులపై సమీక్షించిన మోడీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న  ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.  రాబోయే  1.5 సంవత్సరంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో రిక్రూట్‌మెంట్ చేయాలని అధికారులను ఆదేశించారని ఈ మేరకు  పీఎంవో ట్వీట్ చేసింది.   ప్రభుత్వ శాఖలల్లో  భారీగా ఖాళీలు ఉన్నాయని పలువురు నేతలు ఇటీవల విమర్శలు  చేసిన సంగతి తెలిసిందే..