మీడియా పేరుతో వసూళ్ల దందా.. శామీర్ పేటలో ముగ్గురు అరెస్ట్

మీడియా పేరుతో వసూళ్ల దందా.. శామీర్ పేటలో ముగ్గురు అరెస్ట్

శామీర్ పేట, వెలుగు: ఓ వ్యాపారిని మీడియా పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన శామీర్ పేటకు చెందిన ముగ్గురు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల కింద సిద్దిపేటకు చెందిన మట్టి ప్యాపారి లారీని అడ్డగించి రూ.30,000, తర్వాత మరోసారి రూ.18,000 వసూలు చేసిన నిందితులు.. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారుల ద్వారా లారీని సీజ్ చేయించారు. ఈ వేధింపులతో శివకుమార్ జూన్ 15న ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని, కోలుకున్న తర్వాత మళ్లీ వ్యాపారం ప్రారంభించారు. 

ఈ నెల 29న మళ్లీ రూ.20,000 డిమాండ్ చేస్తూ తన డ్రైవర్​ను కొట్టి, మొబైల్, వాహన తాళాలు లాక్కున్నారు. దీంతో వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్​కు తరలించారు. వారి నుంచి బ్రెజ్జా కారు, మొబైల్ ఫోన్లు, వసూలు చేసిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు.