సిద్ధిపేట కలెక్టర్ ను డిస్మిస్ చేయాలి

సిద్ధిపేట కలెక్టర్ ను డిస్మిస్ చేయాలి

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తానని బెదిరిస్తున్నాడన్నారు.  కలెక్టర్ కు, సీఎంకు చెబుతున్నా.. విత్తనాలు అమ్మండి.. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలశాఖలో వరివిత్తనాలను అందుబాటులో ఉంచుతుందన్నారు.కరీంనగర్ జిల్లా  జమ్మికుంటలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టామని  కలెక్టర్ చెబుతూనే .. వరి వేసుకుంటే ఉరి అంటున్నాడని అన్నారు పొన్నం. రైతులెవరూ ఇలాంటివి చూస్తూ ఊరుకోరన్నారు. ఓవైపు పంటలు దేశవ్యాప్తంగా ధాన్యం పంట ఎక్కువయ్యయాని అంటంటే.. మరోవైపు 70 శాతం తిండిలేక జనం ఇబ్బందులు పడుతన్నారని హిందుస్థాన్ టైం చెబుతోందన్నారు. 

వర్షాలతో భూగర్బ జలాలు పెరిగి వరి తప్ప ఇతర పంటలు వేసుకునే అవకాశం లేదన్నారు పొన్నం. వరి వేయవద్దని చెప్పడం సరికాదన్నారు.
ఏ రైతుకైనా వరివిత్తనాలు అందుబాటులో లేకపోతే.. మా కిసాన్ సెల్ ద్వారా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. విత్తన కంపెనీలు కూడా ఆలోచన చేయాలన్నారు. దుకాణాదారులను బెదిరిస్తే తిరుగుబాటు తప్పదన్నారు. సిద్దిపేట కలెక్టర్ సీఎం తొత్తువు కావచ్చు.. నీవు ఆయన కాళ్లు మొక్కుతావు కావచ్చు. .. కానీ నీలాగా రైతులు, దుకాణాదారులు బానిసలు కాదన్నారు. నీవు ఐఏఎస్ చదివి వచ్చావా.. ఎలా వచ్చావని అన్నారు.

సుమోటోగా తీసుకుని కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్. కోర్టులను కూడా పట్టించుకోనన్న కలెక్టర్ విషయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అతన్ని వెంటనే డిస్మిస్ చేయాలన్నారు.