
ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ ఇందులో నటించడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ ఒరిజినల్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను అమెరికాలో జరుగుతోన్న శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రభాస్ లుక్, హాలీవుడ్ స్టైల్ విజువల్స్, యాక్షన్ సీన్స్‌తో గ్లింప్స్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియోకు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే కాక.. సినీ సెలెబ్రిటీల నుంచి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్ రెండింటిని చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే సినిమా చేయడం గొప్పగా అనిపించింది’ అన్నాడు .
ఈ ప్రాజెక్టులో భాగమైనందకు ఆనందంగా ఉందన్నారు ప్రభాస్, కమల్ హాసన్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.