
ఒకటీ రెండూ కాదు.. అందం, నటన, ఫిట్‌నెస్, సోషల్ సర్వీస్ అంటూ ప్రతి విషయంలోనూ బెస్ట్ అనిపించుకుంటూ ఉంటుంది సమంత. పైగా కూల్ అండ్ స్వీట్ లేడీగానూ పేరు తెచ్చుకుంది. సాటి హీరోయిన్స్ ఎవరైనా బాగా నటిస్తే ఏమాత్రం ఈగో లేకుండా వారిని మెచ్చుకుంటుంది. రీసెంట్‌గా రిలీజైన ‘మిమీ’ మూవీ చూసి కృతీసనన్‌పై కూడా కాంప్లిమెంట్స్ కురిపించింది. సినిమా చాలా బాగుందని, కృతి అద్భుతంగా నటించిందని చెప్పింది. అదలా ఉంచితే సమంత గురించిన ఓ ఇంటరెస్టింగ్ విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమెకి రీసెంట్‌గా ఓ స్పెషల్ చాన్స్ వచ్చిందట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో సమంత నటించబోతోందట. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్‌సిటీలో కోట్లు ఖర్చుపెట్టి వేసిన భారీ సెట్‌లో ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఈ మధ్యనే సినిమా ప్రారంభమైంది. ఇంతలోనే సమంతని తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే హీరోయిన్‌గానా లేక ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇందులో నటిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘శాకుంతలమ్’ చిత్రంలో నటిస్తోంది సామ్. తమిళంలో విజయ్ సేతుపతితోనూ ఓ సినిమా చేస్తోంది. ఎంతో ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ఏదైనా ప్రత్యేకత ఉంటేనే ఎస్ చెబుతోంది. కాబట్టి ఈ వార్త నిజమైతే ప్రభాస్ సినిమాలోనూ ఆమె స్ట్రాంగ్ రోల్‌లోనే కనిపిస్తుంది. ఎవరో ఒకరు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేస్తే కానీ పూర్తి క్లారిటీ రాదు.