టీజర్‌ అదుర్స్: నేను దేవుడిని కాదు..కానీ నాకు అన్నీ తెలుసు

టీజర్‌ అదుర్స్: నేను దేవుడిని కాదు..కానీ నాకు అన్నీ తెలుసు

కె.రాధాకృష్ణ డైరెక్షన్ ప్రభాస్‌-పూజ హెగ్డే జంటగా నటిస్తున్నరాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది. శనివారం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ ను రిలీజ్ చేసింది యూనిట్.  నువ్ ఎవరో నాకు తెలుసు.. కానీ ఏది చెప్పను.. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను.. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను.. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను.. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు..నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆయ‌న స్టైలిష్ లుక్స్‌బాగున్నాయంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ సినిమాపై ఫస్ట్ నుంచే మంచి అంచనాలుండగా.. ఇవాళ రిలీజైన టీజర్ తో మరింత హైప్ వచ్చిందంటున్నారు ఫ్యాన్స్.  ఈ మూవీలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. జ‌న‌వ‌రి 14న  విడుద‌ల చేయ‌నున్నట్లు ఇప్పటికే టీమ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.