బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు చేశారో తెలుసా...

బాలరాముడి  ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు చేశారో తెలుసా...

అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం, నిర్వహణను చూసేందుకు ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర  ట్రస్ట్  రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన కీలక వివరాలను ప్రకటించింది. అయోధ్యలోని శ్రీ రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహించారనేది ఆసక్తికరంగా మారింది. రామ లాలా విగ్రహాలను శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ పాండే తయారు చేశారు. కాశీ నుంచి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ జీ, లక్ష్మీకాంత్ దీక్షిత్ జీ ప్రాణ్ ప్రతిష్ఠా పూజను నిర్వహించారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ తెలిపింది.

మకర సంక్రాంతి తర్వాత జనవరి 16వ తేదీ నుంచి జనవరి 22వతేదీ వరకు రామ జన్మభూమి అయోధ్యలో పవిత్రోత్సవాలు జరిగాయి.  ప్రతిష్ఠాపన కార్యక్రమం  తరువాత అంటే ఈరోజు ( జనవరి 22) నుంచి  విశ్వప్రసన్న తీర్థ జీ నేతృత్వంలో 48 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయి.

అయోధ్యకు తరలి వచ్చిన సాధువులకు, భక్తులకు, అతిథులకు భోజనం పెట్టేందుకు పట్టణంలోని ప్రతి కూడలిలో లంగర్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, ఆహార పంపిణీ కేంద్రాలు, భోజన కేంద్రాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.  

అయోధ్య జరిగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ పూజను గర్భాలయంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, యూపీ గవర్నర్​ ఆనందీ బెన్​, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ పూజలు చేశారు.  ఇక ఆలయ ప్రాంగణంలో  4వేల మంది సాధువులు ఈ పూజల్లో పాల్గొన్నారు. వామిని నారాయణ్, ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ,వివిధ రంగాలకు చెందిన ముఖ్య వ్యక్తులు. లివింగ్, గాయత్రి పరివార్, మీడియా హౌస్‌లు, క్రీడాకారులు, రైతులు, కళాకారులను పూజ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర  ట్రస్ట్ తెలిపింది.