
- బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ వస్తే ఫస్ట్ లేదంటే లాస్ట్ లో ఉంటుందని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేదీ, లేనిదీ నాలుగైదు రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాల్లోనూ తన పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఫస్ట్ లో ఉంటామని, లేకపోతే లాస్ట్ లో ఉంటాం తప్ప మధ్యలో ఉండే చాన్స్ లేదన్నారు.
జేడీయూ ఈసారి 25 కంటే తక్కువ సీట్లనే గెలుస్తుందని, బీజేపీ సీట్లు కూడా తగ్గుతాయన్నారు. తాము గెలిస్తే.. ఎన్డీయే రెండో ప్లేస్ కు, ప్రతిపక్ష ఇండియా కూటమి మూడో స్థానానికే పరిమితం అవుతాయన్నారు. ఈ ఎన్నికల్లో తన కుటుంబసభ్యులెవరినీ పోటీ చేయించడం లేదని తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల మహిళలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించడంపై స్పందిస్తూ.. ఆ స్కీంతో జేడీయూకు ఒరిగే లాభమేమీ ఉండదన్నారు. అది కేవలం ఒక లంచం మాత్రమేనని, గేమ్ చేంజర్ కాబోదన్నారు.