బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి..బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్​రెడ్డి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలి..బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్​రెడ్డి

హుస్నాబాద్, వెలుగు: బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.  కార్యకర్తలకు ప్రతి గడపకు వెళ్లి  కేంద్ర అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.కేంద్ర నిధులతో పనులు చేసి రాష్ట్ర నిధులుగా చెప్పుకుంటున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి కార్యకర్తలకు సూచించారు.  గురువారం హుస్నాబాద్‌‌‌‌లో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని, 

ఈ నెల30 నుంచి జూన్ 30 వరకు నిర్వహించబోయే మహా జన్ సంపర్క్ అభియాన్‌‌‌‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్​చార్జి గంగిడి మోహన్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు బూరుగు సురేశ్, నరేశ్​, రోశయ్య, సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్​, జన్నపురెడ్డి సురేందర్​రెడ్డి, కౌన్సిలర్​ దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్​బాబు పాల్గొన్నారు.