ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డివైడర్ ఎక్కి నిలిచిపోయిన వైనం

ట్రావెల్స్ బస్సు బీభత్సం..  డివైడర్ ఎక్కి నిలిచిపోయిన వైనం

మియాపూర్, వెలుగు: ముంబై హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. మియాపూర్ నుంచి లింగంపల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బైరవ ట్రావెల్స్ బస్సు మదినగూడ జీఎస్ఎం మాల్ వద్దకు రాగానే జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. 

ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు బస్సును రోడ్డు మధ్యలో నుంచి పక్కకు జరిపించి ట్రాఫిక్​ను కంట్రోల్ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.