- విద్యార్థులకు బాలకిష్టారెడ్డి సూచన
బషీర్‌బాగ్,వెలుగు : ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ‘రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజినీరింగ్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీఏ, బీకాం, ఇంజనీరింగ్ వంటి ఏ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా విద్యార్థులకు టెక్నాలజీ ముఖ్యమన్నారు. ఉన్నత విద్యా మండలిలో టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సిలబస్‌లో మార్పులు తెస్తున్నట్లు తెలిపారు.
