
హైదరాబాద్ సిటీ, వెలుగు: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన 54వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి డాక్టర్ యాదగిరి కంభంపాటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.రాజేశ్కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
డాక్టర్ యాదగిరి , కె.రాజేష్ మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పీఆర్ నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు. కొత్త కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్‌గా బి.మహేశ్, జాయింట్ సెక్రటరీగా పి.లింగా రెడ్డి, ట్రెజరర్‌గా వి.వి. భుజంగ రావు, కార్యవర్గ సభ్యులుగా అపర్ణ రాజ్‌హన్స్, డాక్టర్ ఫాతిమా రహీమ్, డాక్టర్ వి. సుధాకర్, డాక్టర్ సజీదా ఖాన్, కడారి సుభాష్, పి. రఘుపతి ఎన్నికయ్యారు.