PuriSethupathi: ఫ్యాన్స్ అలర్ట్ .. పూరి-సేతుపతి మూవీ అప్డేట్.. టైటిల్ టీజర్కు ముహూర్తం ఫిక్స్

PuriSethupathi: ఫ్యాన్స్ అలర్ట్ .. పూరి-సేతుపతి మూవీ అప్డేట్.. టైటిల్ టీజర్కు ముహూర్తం ఫిక్స్

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న  సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌తోపాటు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.

దర్శకుడిగా ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు కావడం.. ఈ బర్త్‌‌‌‌‌‌‌‌డే పూరికి మరింత స్పెషల్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో విజయ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికీ టైటిల్, టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  టబు, దునియా విజయ్, వీటీవీ గణేష్, బ్రహ్మాజీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.