క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ 

V6 Velugu Posted on Oct 26, 2021

హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో.. ఆ మ్యాచ్ లపై  క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ జరుగుతోందని తెలిపారు సీపీ. బెట్టింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బెట్టింగ్ సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని, వారి వివరాలు  రహాస్యంగా  ఉంచుతామని స్పష్టం చేశారు.

హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో బెట్టింగ్ ముఠాను SOT పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.14.92 లక్షల నగదు,  మొబైల్  ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

Tagged Rachakonda CP, Mahesh Bhagwat, betting, Cricket Live Guru app

Latest Videos

Subscribe Now

More News