వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి.. ఇద్దరు సప్లయర్లు అరెస్ట్

వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి.. ఇద్దరు సప్లయర్లు అరెస్ట్
  • మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు
  • 100 కిలోల సరుకు సీజ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వైజాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సప్లయర్లను మల్కాజిగిరి ఎస్‌‌‌‌‌‌‌‌ వోటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశాలోని గంజామ్ ఇచాపూర్​కు చెందిన భువన సబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(20), బరంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్ పట్నాయక్‌‌‌‌‌‌‌‌(24) డిగ్రీ చదివారు. ఏపీలోని వైజాగ్​కు వచ్చి హనుమంతపూర్ జంక్షన్‌‌‌‌‌‌‌‌లో హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్ షాప్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో స్థానిక గంజాయి సప్లయర్ సురేశ్​తో వారికి పరిచయం ఏర్పడింది. 

భువన సబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మహారాష్ట్ర, పుణేకు గంజాయి సప్లయ్ చేయించాలని సురేశ్ ప్లాన్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన చోటు అనే పెడ్లర్​కు గంజాయిని అందించేందుకు భువన సబర్, వరుణ్ కుమార్ 100 కిలోల సరుకుతో వైజాగ్ నుంచి కారులో బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్​వోటీ ఇన్​స్పెక్టర్ రాములు టీమ్ నిఘా పెట్టింది. కీసరలో కారును గుర్తించి.. భువన సబర్, వరుణ్ కుమార్​ను అదుపులోకి తీసుకుంది. 100 కిలోల గంజాయితో పాటు కారును సీజ్ చేసింది. సురేశ్, చోటు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.