టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్ కీలక నిర్ణయం

V6 Velugu Posted on Jun 17, 2021

స్పెయిన్ కు చెందిన టెన్నిస్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ కీలక నిర్ణయం ప్రకటించాడు. ఈనెల 28న ప్రారంభం కానున్న వింబుల్డన్ ఛాంపియన్ షిప్ తోపాటు వచ్చే నెలలో మొదలుకానున్న టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు మాడ్రిడ్ లో  వెల్లడించాడు. కెరీర్ ను మరికొంత కాలం కొనసాగించాలనుకుంటున్నానని.. అయితే నా శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నా సహచర బృందంతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇటీవలే ప్యారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ లో నోవాక్ జెకోవిచ్ చేతిలో 6-3, 3-6, 6-7, 2-6 తేదాతో ఓడిపోయాడు.35 ఏళ్ల ఈ టెన్నిస్ దిగ్గజం ఇప్పటి వరకు 20 సార్లు గ్రాండ్ స్లామ్, రెండుసార్లు వింబుల్డన్ ఛాపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. తనకు సంతోషం కలిగించే పనుల్లో కెరీర్ కొనసాగించడం ఒకటని, నా బృందంతో సుదీర్ఘంగా చర్చించాక కెరీర్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాదల్ స్పష్టం చేశాడు. 

Tagged Rafael Nadal, , Withdraws from wimbledon, Rafael Nadal Tokyo Olympics, Nadal pulls out, Tennis Star player

Latest Videos

Subscribe Now

More News