
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమేనని తెలుస్తున్నదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా, ఆస్తుల పంచాయితీనా అని ప్రశ్నించారు. కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తున్నదని, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయని వివరించారు. సీఎం ఈ డ్రామా వెనక ఉన్నట్టుగా కనిపిస్తున్నదని వెల్లడించారు.