
రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని తెలిపారు. చంద్రబాబు నితిష్ కు కోపం వస్తే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్ల రవి మాట్లాడారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం ఉందని విమర్శించారు మల్లు రవి.
ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేవని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేదని తెలిపారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని వెల్లడించారు.