కరోనా నియంత్రణలో వ్యాక్సినేషనే కీలకం

కరోనా నియంత్రణలో వ్యాక్సినేషనే కీలకం

కరోనా నియంత్రణలో వ్యాక్సినేషనే కీలకమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రోజువారీ వ్యాక్సిన్ సప్లైని తగ్గిస్తోందన్నారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ ను సరఫరా పెంచాలన్నారు. అప్పుడే దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేరుతుందన్నారు. ఈ చిన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదన్నారు. ఏప్రిల్ నుంచి మే 20 మధ్య వ్యాక్సిన్ల సప్లై తగ్గిందన్నారు రాహుల్. ఇందుకు సంబంధించిన గ్రాఫ్ ను రాహుల్ షేర్ చేశారు. రోజువారీ వ్యాక్సిన్ల ఉత్పత్తితో పోల్చితే...సప్లై చేసే టీకాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు.